Header Banner

ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!

  Tue May 27, 2025 12:36        India

అదృష్టం ఎప్పుడు, ఎవరి తలుపు తడుతుందో ఊహించడం కష్టం. ఒక్కోసారి చిన్న ప్రయత్నమే ఊహించని కానుకను అందించి, జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే చెన్నైకి చెందిన 56 ఏళ్ల శ్రీరాం రాజగోపాలన్ విషయంలో జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నిర్వహించే ప్రతిష్ఠాత్మక 'ఎమిరేట్స్ డ్రా మెగా7' లాటరీలో ఆయన ఏకంగా 231 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని గెలుచుకుని, ఒక్కరాత్రిలోనే కోటీశ్వరుడిగా అవతరించారు. వివరాల్లోకి వెళితే, వృత్తిరీత్యా రిటైర్డ్ ఇంజినీర్ అయిన శ్రీరాం రాజగోపాలన్, తన జన్మదినమైన మార్చి 16న సరదాగా ఎమిరేట్స్ డ్రా లాటరీ టికెట్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారు. అప్పుడు ఆ టికెట్ తన జీవితాన్ని ఇంతలా మార్చేస్తుందని ఆయన కలలో కూడా ఊహించలేదు. మెగా7 లాటరీలో భాగంగా ఆయన యాధృచ్ఛికంగా ఏడు నెంబర్లను ఎంచుకున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

ఆశ్చర్యకరంగా, ఆయన ఎంచుకున్న అవే నెంబర్లు జాక్‌పాట్‌ను తెచ్చిపెట్టాయి. లాటరీ ఫలితాలు వెలువడినప్పుడు, తొలుత శ్రీరాం ఈ వార్తను నమ్మలేకపోయారు. "డ్రా వీడియోను రెండుసార్లు చూశాను. స్క్రీన్‌షాట్‌లు తీసుకున్న తర్వాతే ఇది నిజమని నమ్మకం కుదిరింది. దీని వెనుక ఎలాంటి లాజిక్ లేదు, ఇది పూర్తిగా అదృష్టమే" అని శ్రీరాం ఆనందంతో తెలిపారు. ఈ భారీ విజయం తన జీవితాన్ని ఒక్కరోజులోనే మార్చేసిందని ఆయన చెప్పారు. "నా సమయం ఇప్పుడు వచ్చింది. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక సమయంలో అవకాశం వస్తుంది. ఆశను ఎప్పుడూ వదులుకోవద్దు, ఆటను ఆనందంగా, బాధ్యతాయుతంగా ఆడండి" అని సూచించారు. శ్రీరాంకు ఖాళీ సమయాల్లో ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయడం అలవాటు. ఆ ఆసక్తితోనే ఆన్‌లైన్ లాటరీ గురించి తెలుసుకుని, సరదాగా ఆడటం ప్రారంభించారు. అదే ఇప్పుడు ఆయనకు ఊహించని విజయాన్ని అందించింది. ఈ వార్త ప్రస్తుతం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

లోకేశ్​కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!

 

వల్లభనేని వంశీకి దెబ్బపై దెబ్బ.. బెయిల్ పిటిషన్ కొట్టివేత!

        

అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి షాక్! 14 రోజుల రిమాండ్..

 

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లా పేరు మారుస్తూ జీవో జారీ!

 

వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!

 

కేంద్రం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌! రాష్ట్రానికి మరో 2 లక్షల కనెక్షన్లు!

 

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 2న కీలక ప్రకటనలు! కొత్త ఆరోగ్య పథకం..

 

ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #IndigoAirlines #IndiraGandhiInternationalAirport #NewDelhi #BombHoax #SecurityChecks #Varanasi